Header Banner

Liquor Scam: జగన్ కి బిగ్ షాక్.. మాజీ ఎమ్మెల్యే అరెస్ట్‌.. నేడు కోర్టు ముందు హాజరు! ఈ వ్యవహారంలో కర్త, కర్మ, క్రియగా..

  Wed Jun 18, 2025 12:41        Politics

ఏపీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన వైకాపా నేత చెవిరెడ్డి భాస్కర్రెడ్డి (Chevireddy Bhaskar Reddy ని సిట్ అధికారులు విజయవాడకు తీసుకొచ్చారు. బెంగళూరులో మంగళవారం ఆయన్ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. విజయవాడ సిట్ కార్యాలయంలో విచారణ అనంతరం ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు. చెవిరెడ్డితో పాటు అరెస్టయిన ఆయన సన్నిహితుడు వెంకటేశ్నాయుడిని కూడా నగరానికి తీసుకొచ్చారు. వైకాపా హయాంలో జరిగిన రూ. వేల కోట్ల మద్యం కుంభకోణం కేసుపై సిట్ అధికారులు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. డిస్టిలరీలు, మద్యం సరఫరా కంపెనీల నుంచి కొల్లగొట్టిన సొత్తులో కొంత మొత్తాన్ని గత ఎన్నికల్లో వైకాపా అభ్యర్థులకు చేరవేసినట్లు దర్యాప్తులో సిట్ గుర్తించింది.

 

ఇది కూడా చదవండి: Begumpet Airport: తీవ్ర ఉద్రిక్తం.. బేగంపేట్ ఎయిర్ పోర్టుకు బాంబ్ బెదిరింపు! బాంబ్ స్వ్కాడ్ తనిఖీలు!

 

ఈ వ్యవహారంలో కర్త, కర్మ, క్రియగా చెవిరెడ్డి భాస్కర్రెడ్డి వ్యవహరించారు. ఈ ముడుపుల సొమ్మును కలెక్షన్ పాయింట్లకు చేరవేయడంలో ఆయన బాల్యమిత్రుడు, సన్నిహితుడు వెంకటేశ్ నాయుడు కీలకపాత్ర పోషించినట్లు తేల్చింది. వీరిద్దరూ బెంగళూరు నుంచి శ్రీలంకకు పారిపోతుండగా విమానాశ్రయంలో ఇమిగ్రేషన్ అధికారులు మంగళవారం ఉదయం అడ్డుకున్నారు. చెవిరెడ్డి, వెంకటేశ్ నాయుడిపై లుక్ అవుట్ సర్క్యులర్లు ఉండడంతో వారిద్దరినీ అక్కడే నిర్బంధించి ఆ సమాచారాన్ని సిట్ అధికారులకు తెలిపారు. సిట్ బృందాలు బెంగళూరు వెళ్లి, మంగళవారం రాత్రి వారిద్దరినీ అరెస్టు చేశాయి. వీరి అరెస్టుతో మద్యం కుంభకోణంలో అరెస్టయిన నిందితుల సంఖ్య తొమ్మిదికి చేరింది.

 

ఇది కూడా చదవండి: Adabidda nidhi Scheme: ఏపీ మహిళలకు శుభవార్త.. నెలకు రూ. 1500పై కీలక అప్‌డేట్! ఈ పథకం త్వరలోనే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

Free bus: ఆడవాళ్ళకి అదిరిపోయే శుభవార్త... ఆగస్టు 15 నుంచి అమలు!

 

Pakistan: భారత్ పై యుద్ధం తప్ప మరో దారి లేదు.. పాకిస్థాన్ సంచలన వ్యాఖ్యలు!

 

Rythu Bharosa: రైతన్నలూ.. బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోండి! పంట పండించే ప్రతి ఎకరాకు!

 

Chandrababu warning Jagan: పులివెందుల రాజకీయం చేస్తే.. తోక కట్ చేస్తా! ఎవరు తప్పు చేసినా..

 

అధికారులు అలర్ట్.. చంద్రబాబు హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్యలు! విశాఖపట్నంలో సీఎం పర్యటన..

 

ఏసీబీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తతలు! మాజీ మంత్రికి మద్దతుగా వచ్చిన కార్యకర్తలు అరెస్ట్!

 

ఆ జిల్లా టమాటా రైతులపై ఊజీ ఈగ పిడుగు! దీంతో కొనేవారే..

 

సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్! FDలపై గరిష్ఠ వడ్డీ ఇస్తున్న బ్యాంకులు!

 

అసైన్డ్‌ భూములకు రెక్కలు.. ఈ డీల్‌తో రంగం.. ఆ జిల్లా కేంద్రంగా విశాఖ అధికారుల భేటీలు!

 

తల్లికి వందనం పడలేదా! పిల్లలు ఇప్పుడే ఫస్ట్ క్లాస్ కి వెళ్తున్నారా...అయితే ఇలా నమోదు చేసుకోండి!

 

ఆ రెండు దేశాలు చేస్తున్న హడావిడి చూస్తుంటే.. గోల్డ్ రేట్లు ఆకాశంలోకే! బంగారం రూ.3 లక్షలు..కారణం ఇదే!

 

ట్రంప్ ‘గోల్డ్ కార్డ్’ వెబ్‌సైట్‌: అమెరికా పౌరసత్వం కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో చూద్దాం! అర్హతలివే!

 

సవాల్ చేస్తే సౌండ్ ఆఫ్! శరణమా, న్యాయ సమరమా తేల్చుకోవాలని జగన్‌కు సూచన!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #AndhraPradesh #Appolitics #APnews #YVPLeader #Chevireddy #Vijayawada #Arrest